Meghana Nayudu: రహస్యంగా పెళ్లి చేసుకుని, మూడేళ్ల తరువాత బయటపెట్టిన నటి మేఘనా నాయుడు!

  • పలు చిత్రాల్లో నటించిన మేఘన
  • 2016లో టెన్నిస్ ఆటగాడు లూయిస్ తో వివాహం
  • ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన మేఘన

తెలుగులో హీరోయిన్ గా పరిచయమై, ఆ తరువాత కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి, ఎక్కువగా ఐటమ్ సాంగ్ లకే పరిమితమైన మేఘనా నాయుడు షాకింగ్ నిజాన్ని చెప్పింది. తాను మూడేళ్ల క్రితమే ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకున్నానని పేర్కొంది. 2016లో టెన్నిస్ ఆటగాడు లూయిస్ ను పెళ్లి చేసుకున్నానని, ఆయనతోనే ఉంటున్నానని ఓ ప్రకటనలో చెప్పిన మేఘన, తమ పెళ్లి ముంబైలో సీక్రెట్ గా జరిగిందని, వచ్చే సంవత్సరం తాము క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం చేసుకోనున్నామని వెల్లడించింది.

కాగా, మేఘన రహస్య పెళ్లిపై గతంలోనే వార్తలు వచ్చాయి. ఆమె విదేశీయుడిని పెళ్లాడి, అక్కడే సెటిల్ అయినట్టు కూడా మీడియా కోడైకూసింది. అప్పట్లో స్పందించని మేఘన, ఇప్పుడు తన పెళ్లిపై ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక, ఇన్నాళ్లూ వివాహాన్ని ఎందుకు దాచివుంచాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

Meghana Nayudu
Secret Marriage
Louis
  • Loading...

More Telugu News