Andhra Pradesh: "ఓడిపోతామన్న భయంతోనే ఈసీపై విమర్శలా?" అన్న జర్నలిస్ట్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇది!

  • వైసీపీని, బీజేపీని, ఈసీని టార్గెట్ చేసుకుని విమర్శలు
  • ఎన్నికలు ముగిసినా నిరసనగళాన్ని వినిపిస్తున్న చంద్రబాబు
  • ఈవీఎంలపై వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపాటు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తరువాత, అధికారుల బదిలీల తరువాత,  వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఈసీలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్నికలు  ముగిసి, నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ, నిన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, ఈసీ అధికారులతో సుదీర్ఘ సమావేశం జరిపిన సంగతి తెలిసిందే.

ఆపై బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న వేళ, ఓ జర్నలిస్ట్, "మీరు ఎందుకిలా విమర్శలు చేస్తున్నారు? ఓడిపోతారనే భయమా?" అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు, ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, వాటి పనితీరుపై ఒక్క మాట కూడా మాట్లాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ సంగతేంటని ఎదురు ప్రశ్నించారు. ఇంతవరకూ జగన్ అసలు స్పందించలేదని గుర్తు చేస్తూ, జగన్ వైఖరికి కారణమేంటని మండిపడ్డారు.

Andhra Pradesh
EVMs
Chandrababu
Journalist
Jagan
  • Loading...

More Telugu News