Andhra Pradesh: కాబోయే ఆంధ్రా సీఎం జగనే.. వైసీపీకి 125 సీట్లు వస్తాయి!: అవంతి శ్రీనివాస్

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేత
  • జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా
  • భీమిలిలో భారీ మెజారిటీతో గెలుస్తానని వ్యాఖ్య

వైసీపీ నేత, అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ 125 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ పాలనకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జగన్ తోనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. తాను భీమిలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని అవంతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Jagan
YSRCP
avanti
Telugudesam
Tirumala
  • Loading...

More Telugu News