Jagan: అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన వైఎస్ జగన్!

  • నేడు బీఆర్ అంబేద్కర్ జయంతి
  • పూలమాల వేసి నివాళులు
  • జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. ఈ ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి తలారి రంగయ్య తదితరులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో నగర మేయర్ సురేష్ బాబు, కడప కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు అంజాద్ బాషా, రవీంద్రనాధ్ రెడ్డి తదితరులు అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

Jagan
Ambedkar
Birthday
YSRCP
  • Loading...

More Telugu News