India: అనిల్ అంబానీపై ఫ్రెంచ్ పత్రిక కథనం అవాస్తవం: ఫ్రాన్స్ రాయబారి

  • రూ. 1,123 కోట్ల పన్ను రద్దు చేసినట్టు కథనాలు
  • అవగాహన మేరకే పన్ను రాయితీలు
  • రాజకీయ జోక్యాలు లేవన్న అలెగ్జాండర్ జిగ్లర్

రాఫెల్ డీల్ కు ముందు అనిల్ అంబానీకి దాదాపు రూ. 1123 కోట్ల పన్నును రద్దు చేశారని ఫ్రెంచ్ పత్రిక 'లీ మాండే'లో వచ్చిన కథనం అవాస్తవమని ఇండియాలో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ వ్యాఖ్యానించారు. నేడు వివరణ ఇచ్చిన ఆయన, పన్ను మినహాయింపులన్నీ ఫ్రాన్స్ అధికారులు, రిలయన్స్ ఎఫ్ఎల్ఏజీ మధ్య కుదిరిన అవగాహన మేరకే లభించాయని, ఇందులో రాజకీయ జోక్యాలేమీ లేవని అన్నారు. ఫ్రాన్స్ చట్టాలకు, ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు లోబడే మినహాయింపులు లభించాయని అన్నారు. కాగా, ఈ పన్ను రాయితీలు రాఫెల్ డీల్ కుదరడానికి చాలా కాలం ముందే తమకు వచ్చాయని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. పన్ను రాయితీలకు, రాఫెల్ ఒప్పందానికి సంబంధం లేదని పేర్కొంది. 

India
France
Anil Ambani
Rafele
  • Loading...

More Telugu News