Andhra Pradesh: ఈ ఎన్నికల్లో ధర్మానిదే అంతిమ విజయం.. అభివృద్ధికే ప్రజల పట్టాభిషేకం!: సీఎం చంద్రబాబు

  • తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
  • రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన అందించాం
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడే మనందరికీ మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. ఆయన బాటలోనే గత ఐదేళ్లుగా సుపరిపాలన అందించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ధర్మానిదే అంతిమ విజయం కాబోతోందనీ, అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని బాబు జోస్యం చెప్పారు.

ఈరోజు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘తెలుగువారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీ రామచంద్రుడే మనకు మార్గదర్శి. లోక కల్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీ రాముడి బాటలో ఐదేళ్లూ సుపరిపాలన సాగించాము. ఈ ఎన్నికల్లో ధర్మానిదే అంతిమ విజయం. అభివృద్ధికే ప్రజల పట్టాభిషేకం’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
sriramanavami
wishes
Twitter
  • Loading...

More Telugu News