Rajamahendravaram: పీకే అంటే పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు... మనకూ ఓ 'పీకే' ఉంది: టీడీపీ నేత ఆదిరెడ్డి భవాని!
- 'పీకే' అంటే పసుపు - కుంకుమ
- విజయవంతమైన పథకంతోనే ఓట్ల వర్షం
- తన గెలుపు ఖాయమన్న భవాని
వైసీపీకి 'పీకే' పేరిట ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్త ఉన్నారని, జనసేన పార్టీకి అధినేతే 'పీకే' అని, అయితే తెలుగుదేశం పార్టీకి కూడా ఓ 'పీకే' ఉందని, అదే ఓట్లను తెచ్చిపెట్టిందని, ఈ ఎన్నికల్లో మిగతా రెండు 'పీకే'లూ ఓడిపోయి, టీడీపీ 'పీకే' మాత్రమే విజయం సాధించనుందని రాజమహేంద్రవరం నగర టీడీపీ అభ్యర్థిని ఆదిరెడ్డి భవాని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రవేశపెట్టిన 'పీకే'... 'పసుపు - కుంకుమ' పథకమని, ఈ పథకం విజయంతో మిగతా రెండు పార్టీలూ ఓడిపోనున్నాయని ఆమె అన్నారు. పార్టీపై ప్రేమతో, తన కుటుంబంపై ఉన్న గౌరవంతో, టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఓటర్లంతా తనను ఆశీర్వదించారనే భావిస్తున్నానని ఆమె అన్నారు. తన గెలుపు ఖాయమని, నగర ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే క్షణాల కోసం తాను ఎదురు చూస్తున్నానని, నిజాయతీగా పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉండటమే తన ముందున్న కర్తవ్యమని తెలిపారు.