myawati: స్టేజ్‌పై మాయావతి.. బూట్లు విప్పి స్టేజిపైకి వెళ్లిన ఆర్‌ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్

  • అజిత్‌‌సింగ్‌ను అడ్డుకున్న బీఎస్పీ కో ఆర్డినేటర్
  • షూ విప్పి స్టేజీపైకి వెళ్లాలని ఆదేశం
  • షహరాన్‌పూర్ ర్యాలీలో ఘటన

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)-బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)-రాష్ట్రీయ లోక్‌దళ్ ఆర్ఎల్‌డీ) పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. షహరాన్‌పూర్‌లో తొలిసారి ఈ మూడు పార్టీల నేతలు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్‌ఎల్డీ అధినేత అజిత్ సింగ్ హాజరయ్యారు.

అప్పటికే స్టేజిపై ఉన్న మాయావతిని కలిసేందుకు అఖిలేశ్ యాదవ్, అజిత్ సింగ్ వేదికపైకి వెళ్తుండగా బీఎస్పీ కోఆర్డినేటర్ ఒకరు అజిత్‌ను అడ్డుకున్నారు. షూ విప్పి వేదికపైకి వెళ్లాలని చెప్పడంతో అజిత్ తన షూ విప్పక తప్పలేదు.

స్టేజీపైన తాను తప్ప మరెవరూ షూ ధరించడం మాయావతికి ఇష్టం ఉండదు. ఆమెను కలవాలంటే ఎవరైనా చెప్పులు విప్పాల్సిందే. అయితే, దీని వెనక ఓ కారణం ఉందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు. ఆమెకు డస్ట్ అలెర్జీ సమస్య ఉందని, అందుకే ఆమె వద్దకు వెళ్లేవారిని చెప్పులు విప్పాల్సిందిగా కోరుతామని వివరించారు. ఈ క్రమంలో తనకంటే వయసులో చిన్నదైన మాయావతి వద్దకు వెళ్లేందుకు 80 ఏళ్ల అజిత్ సింగ్‌కు కూడా చెప్పులు విప్పక తప్పింది కాదు. ఏప్రిల్ 7న షహరాన్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News