Chris gayle: టీ20 క్రికెట్‌లో మరో అద్భుతమైన రికార్డు నెలకొల్పిన గేల్

  • వందసార్లు 50కిపైగా పరుగులు
  • ఇందులో 21 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు
  • గేల్ తర్వాతి స్థానంలో డేవిడ్ వార్నర్

విండీస్ విధ్వంసకర ఆటగాడు, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ గేల్ మరో అత్యద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే ఆటతీరుతో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన 39 ఏళ్ల గేల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని రికార్డును నమోదు చేశాడు. శనివారం నాటి మ్యాచ్‌లో 99 పరుగులు చేసిన గేల్.. టీ20 క్రికెట్‌లో వందసార్లు 50కిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇందులో 21 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గేల్ తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 73సార్లు 50కిపైగా స్కోరు నమోదు చేశాడు.

Chris gayle
punjab
RCB
T20 cricket
David Warner
IPL
  • Loading...

More Telugu News