Saipallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వాటికి ప్రచారం చేయనంటున్న సాయిపల్లవి! 
  • భర్తతో మరో సినిమా లేదంటున్న సమంత 
  • 'నాలుగో సింహం' గా 'జబర్దస్త్' ఫేం

*  సౌందర్య పరిరక్షణకు సంబంధించిన ఉత్పత్తులకు తాను ప్రచారం చేయనని అంటోంది కథానాయిక సాయిపల్లవి. 'మేకప్ అనేది నాకు ఇష్టం వుండదు. మేకప్ వేసుకుంటే మనం మనలా ఉండం, మరొకరిలా వుంటాం. అందుకే నాకు బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం వుండదు. దీనిని దృష్టిలో పెట్టుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ కి ప్రచారం చేయను' అని చెప్పింది సాయిపల్లవి.
*  అక్కినేని నాగ చైతన్య, సమంత జంట వివాహం తర్వాత కలసి నటించిన 'మజిలీ' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఈ జంటతో చిత్రాలు నిర్మించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ఏడాది మళ్లీ ఇద్దరం కలసి నటించే అవకాశం లేదని సమంత తాజాగా పేర్కొంది.
*  'జబర్దస్త్' ఫేం షకలక శంకర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం 'నాలుగో సింహం'. జానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఇందులో అక్షయ్ శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Saipallavi
samantha
chaitanya
shakalaka shankar
  • Loading...

More Telugu News