German Police: ఇతరుల కళ్లు దెబ్బతింటాయట.. 'బంగారం' లాంటి కారును సీజ్ చేసిన పోలీసులు

  • బంగారం తాపడంతో రోడ్డుపై తిరుగుతున్న పోర్చే
  • దాని వల్ల ఇతర వాహనాల డ్రైవర్లకు కళ్లుపోతాయని పోలీసుల హెచ్చరిక
  • కారును స్వాధీనం చేసుకుని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన పోలీసులు

బంగారం ఫాయిల్ కలిగిన పోర్చే పనామెరా కారును దాని యజమాని నుంచి జర్మనీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది రోడ్డు మీద వెళ్తుంటే దానిని చూసే ఇతర వాహనాల్లోని డ్రైవర్ల కళ్లు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే కారును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కారు రోడ్డు మీద నడవడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. హంబర్గ్‌లో ఈ కారును నడుపుకుంటూ వెళ్తున్న 31 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత కారుకు తొడిగిన బంగారు తాపడాన్ని తొలగించాలని ఆదేశించారు. కారుకున్న పసిడిపూతను తొలగించాక తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు.

అయినప్పటికీ అతడు తన కారుకున్న బంగారు తాపడాన్ని తొలగించేందుకు ససేమిరా అనడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కారు తాళాలు, పేపర్లు, లైసెన్స్ ప్లేటును తీసుకున్నారు. కారు యజమానికి పెద్దమొత్తంలో జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత కారును సీజ్ చేసిన ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

  • Loading...

More Telugu News