Priyanka Gandhi: మోదీకి పోటీగా బరిలోకి దిగనున్న ప్రియాంక!

  • గతంలో వారణాసి నుంచి సునాయాసంగా గెలిచిన మోదీ
  • 2019లోనూ వారణాసి నుంచే పోటీ 
  • కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం రావలసివుంది 

గత ఎన్నికల్లో సునాయాసంగా గెలిచిన ప్రధాని మోదీ, ఈసారి మాత్రం వారణాసిలో గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే, ఆయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీని బరిలోకి దింపనుందని సమాచారం. దీని కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సమాలోచనలు చేసిందని, దీంతో ప్రియాంక కూడా పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే రావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యూపీలో పార్టీని పటిష్ఠపరిచే బాధ్యతను తనకు అప్పగించారని, ఒకవేళ పార్టీ కోరితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక తెలిపారు.

Priyanka Gandhi
Narendra Modi
Congress
BJP
Loksabha
Varanasi
  • Loading...

More Telugu News