Rahul Gandhi: రాహుల్ గాంధీ మాస్టర్స్ డిగ్రీ లేకుండానే ఎంఫిల్ చేసేశారు మరి!: జైట్లీ

  • కాంగ్రెస్ పై బీజేపీ ఎదురుదాడి
  • స్మృతి విద్యార్హతలపై విమర్శలకు కౌంటర్
  • ఏకంగా రాహుల్ ను లక్ష్యంగా చేసుకున్న ఆర్థికమంత్రి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సమస్యల విషయం పక్కనబెట్టి విద్యార్హతల యుద్ధంలో తలమునకలుగా ఉన్నారు. మంత్రి స్మృతి ఇరానీ ఎన్నికల అఫిడవిట్ లో ఈసారి డిగ్రీ ఫస్టియర్ తో చదువు ఆపేసినట్టు పేర్కొన్నారని కాంగ్రెస్ విమర్శలు చేయడంతో ఈ విషయం రాజుకుంది. గత ఎన్నికల సమయంలో ఆమె బీకాం చదివినట్టు పేర్కొనడంతో తీవ్ర విమర్శలపాలైంది. మరోసారి కాంగ్రెస్ వర్గాలు స్మృతి విద్యార్హతలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా రంగంలోకి దిగారు.

తాను రాసిన ఓ వ్యాసంలో కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్హతల గురించి పంచాయతీ పెడితే జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి అంటూ ఎత్తిపొడిచారు. అయినాగానీ, మాస్టర్స్ డిగ్రీ లేకుండానే రాహుల్ ఎంఫిల్ చేసేశారంటూ ఎద్దేవా చేశారు.

Rahul Gandhi
Arun Jaitly
Congress
BJP
  • Loading...

More Telugu News