Kurnool: కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేపుతున్న శిశువు మృతి

  • కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరిన మెర్సీ
  • శుక్రవారం మగబిడ్డకు ప్రసవం
  • శిశువు తల, ముక్కుపై రక్తపు గాట్లు

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు మృతి కలకలం రేపుతోంది. కర్నూలు మండలం ఈ.తాండ్రపాడుకు చెందిన మెర్సీ అనే మహిళ కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. శుక్రవారం అర్థరాత్రి ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఆ శిశువు మృతి చెందాడు. శిశువు తల, ముక్కుపై రక్తపు గాట్లు ఉండటంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడని శిశువు తండ్రి, బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగటంతో, ఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 

Kurnool
Government Hospital
Baby boy
Doctors
Mersy
  • Loading...

More Telugu News