Sharmila: సింహం సింగిల్‌గా వస్తుందని.. షర్మిల నా గురించే చెప్పారు: కేఏ పాల్

  • గాజువాకలో పవన్ గెలిచే అవకాశం
  • జగన్ వస్తే రాష్ట్రం రావణకాష్టమే
  • 60 శాతం యూత్ ఓట్లు మా పార్టీకే పడ్డాయి

సింహం సింగిల్‌గా వస్తుందని, వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల తన గురించే చెప్పారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ సహకారంతో గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మళ్లీ మోదీయే అధికారంలోకి వస్తే దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతుందని, ఏపీలో జగన్ వస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

తన నోరు మూయించేందుకు భారతరత్న, నోబెల్ పురస్కారానికి తన పేరును మోదీ సిఫారసు చేశారని తెలిపారు. తన ప్రచారానికి ఆకర్షితులైన యూత్, 60 శాతం ఓట్లను తమ పార్టీకి వేశారన్నారు. తన వల్ల లబ్ధి పొందిన నేతలే తనకు మద్దతు ఇవ్వలేదని కేఏ పాల్ తెలిపారు. జగన్ మీడియా తప్ప తననెవరూ జోక్‌గా తీసుకోవడం లేదని, 2014లో తాను మద్దతిచ్చిన నేతలంతా స్వీప్ చేశారని వెల్లడించారు.

Sharmila
KA Paul
Pavan kalyan
Janasena
Narendra Modi
  • Loading...

More Telugu News