jayasudha: 'జబర్దస్త్' కామెడీ షోకి న్యాయనిర్ణేతగా వుండేందుకు నిరాకరించిన జయసుధ

  • పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
  • రోజా స్థానంలో మీనా 
  • నాగబాబు ప్లేస్ లో శేఖర్ మాస్టర్

ఈటీవీలో ప్రసారమవుతోన్న 'జబర్దస్త్' కామెడీ షో .. ఎంతో పాప్యులర్ అయింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే నాగబాబు .. రోజా తమ పార్టీలకి సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. ఆ తరువాత కూడా వాళ్లు రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారట. అందువలన ఈ కామెడీ షో నిర్వాహకులు .. క్రేజ్ వున్న సీనియర్ ఆర్టిస్టులను న్యాయనిర్ణేతలుగా తీసుకునేందుకు వాళ్లతో సంప్రదింపులు జరిపారట.

ఆ క్రమంలోనే జయసుధను కూడా సంప్రదించారనీ, అయితే ఆమె సున్నితంగా తిరస్కరించారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఒక  కథనాన్ని ప్రచురించింది. కుటుంబ కథా చిత్రాల నాయికగా .. సహజనటిగా జయసుధకు మంచి పేరు వుంది. రీ ఎంట్రీలో ఆమె తన వయసుకి తగిన హుందాతనంతో కూడిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఈ కారణంగానే తనకి, ఈ కామెడీ షోకి సెట్ కాదని ఆమె సున్నితంగా తిరస్కరించారని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. జయసుధ తిరస్కరించిన తరువాతనే మీనాని ఎంపిక చేసుకున్నారన్న మాట. ఇక నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News