delhi: ఢిల్లీలో సీఈసీని కలిసిన చంద్రబాబు

  • ఏపీలో పోలింగ్ జరిగిన తీరుపై  ఫిర్యాదు
  • ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ఆరోపణ
  • ఈ మేరకు ఫిర్యాదు చేసిన చంద్రబాబు

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను ఏపీ సీఏం చంద్రబాబునాయుడు కొద్ది సేపటి క్రితం కలిశారు. చంద్రబాబు సహా 15 మంది టీడీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంలలో లోపాలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని, ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆయనకు ఫిర్యాదు చేశారు.

ఏపీలో అధికారులను కారణాలు చెప్పకుండా బదిలీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుర్తించలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని, దీనిపై తాము చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదని, తమ నేతలపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని ఆరోపిస్తూ సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

delhi
cec
cm
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News