Srikakulam District: వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోంది
  • ఇది మంచి పద్ధతి కాదు
  • ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ శ్రద్ధ చూపాలి

ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీవీ ప్యాట్స్ స్లిప్పుల లెక్కింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ మరింత శ్రద్ధ చూపాలని కోరారు. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, బీజేపీకి అనుకూలంగానే ఈసీ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.

Srikakulam District
Telugudesam
mp
ram mohan naidu
  • Loading...

More Telugu News