Bollywood: సంపాదనలో బిగ్ బీ జోరు.. ఏకంగా రూ.70 కోట్లు పన్ను కట్టిన బాలీవుడ్ మెగాస్టార్!

  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెల్లింపు
  • ఇప్పటికే 2,084 మంది రైతులకు సాయం
  • సీఆర్పీఎఫ్ అమరుల కుటుంబాలను ఆదుకున్న బచ్చన్

సామాన్యులకు సాయం చేయడంలోనే కాదు.. సంపాదనలోనూ బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దూసుకుపోతున్నారు. ఇటు సినిమాలు, అటు ప్రకటనలతో బిగ్ బీ రెండు చేతులా అర్జిస్తున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి అమితాబ్ బచ్చన్ కట్టిన పన్ను వివరాలు బయటకు వచ్చాయి.  

2018-19 ఆర్థిక సంవత్సరానికి అమితాబ్ రూ.70 కోట్లను ఐటీ శాఖకు పన్నుగా చెల్లించినట్లు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. మరోపక్క, అమితాబ్ ముజఫర్ నగర్ లో అప్పుల్లో కూరుకుపోయిన 2,084 మంది  రైతుల రుణాలను చెల్లించారు. అలాగే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందించారు. ప్రస్తుతం అమితాబ్ బ్రహ్మాస్త్ర, సైరా సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఆయన కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Bollywood
Amitabh Bachchan
tax
70 crore
  • Loading...

More Telugu News