West Godavari District: నర్సాపురంలో రీ-పోలింగ్ నిర్వహించాలి: కేఏ పాల్ డిమాండ్

  • రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయి
  • ‘హెలికాఫ్టర్’ గుర్తుకు ఓటు వేస్తే ‘ఫ్యాన్’కు పడ్డాయి
  • ఈ ఎన్నికల్లో రష్యన్ టెక్నాలజీని ఉపయోగించారు

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రీ-పోలింగ్ నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, హెలికాఫ్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యాన్ గుర్తుకు పడ్డాయని ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో రష్యన్ టెక్నాలజీని ఉపయోగించారని, రష్యన్ చిప్స్ అమర్చారన్న అనుమానాలు వున్నాయని అన్నారు. మోదీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని ఆరోపణలు చేశారు. కాగా, ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఈరోజు ఆయన కలవనున్నారు.

West Godavari District
Narasapuram
prajashanti party
  • Loading...

More Telugu News