jagan: ప్రశాంత్ కిశోర్ బృందాన్ని అభినందించిన జగన్

  • హైదరాబాదులోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్
  • ఐప్యాక్ బృందంతో కాసేపు ముచ్చట్లు
  • పార్టీ కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన జగన్

ఏపీ ఎన్నికలలో వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్, ఆయనకు చెందిన ఐప్యాక్ బృందాన్ని జగన్ అభినందించారు. హైదరాబాదులో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఐప్యాక్ బృందంతో ఆయన ముచ్చటించారు. వైసీపీ కోసం పని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లకు పైగా వైసీపీ కోసం ఐప్యాక్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మేనిఫెస్టో రూపకల్పన నుంచి పార్టీ అంతర్గత సర్వేలు, సోషల్ మీడియా ప్రచారం వరకు అన్నీ ఐప్యాక్ చూసుకుంది. వైసీపీ అధిష్ఠానానికి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించింది. మరోవైపు, వైసీపీ గెలుపుపై జగన్ ధీమాగా ఉన్నారు. 110 నుంచి 130 సీట్ల వరకు వస్తాయని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

jagan
ipac
prashat kishor
ysrcp
  • Loading...

More Telugu News