ap: ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువ!
- 2014లో 78.41 శాతం పోలింగ్
- ఈసారి 79.64 శాతం పోలింగ్ నమోదు
- ప్రకాశం జిల్లాలో దాదాపు 86 శాతం పోలింగ్ నమోదు
ఏపీలో జరిగిన ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఈవీఎంలు మొరాయించినా, రాత్రి అయిపోయినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 3,13,33,631 ఓట్లు పోలయ్యాయి.
వీరిలో 1,55,45,211 మంది పురుషులు, 1,57,87,759 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేయడం గమనార్హం. 2014లో 78.41 శాతం పోలింగ్ నమోదు కాగా... ఈసారి పోలింగ్ శాతం మరింత పెరిగింది. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
- శ్రీకాకుళం - 75.14
- విజయనగరం - 80.68
- విశాఖపట్నం - 71.81
- తూర్పుగోదావరి - 80.08
- పశ్చిమగోదావరి - 82.19
- కృష్ణా - 81.12
- గుంటూరు - 82.37
- ప్రకాశం - 85.93
- నెల్లూరు - 76.68
- కడప - 77.21
- కర్నూలు - 77.68
- అనంతపురం - 81.90
- చిత్తూరు - 81.03