Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ప్రతిపాదన

  • ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
  • 22 నుంచి మే 14 వరకు ఈ ఎన్నికలు నిర్వహించాలి
  • ఆయా తేదీలను ఈసీకి ప్రతిపాదన 

తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ విషయమై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఈరోజు సమీక్షించారు. అనంతరం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆయా తేదీలను ఈసీకి ప్రతిపాదించారు. కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కొన్నాళ్లుగా ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 32 జిల్లాలకు చెందిన 535 జెడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది.  
 

Telangana
MPTC
ZPTC
Elections
cm
kcr
  • Loading...

More Telugu News