Bhadrachalam: ఈ నెల 20 వరకూ కొనసాగనున్న భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు!

  • నేడు స్వామివారికి భేరిపూజ, ధ్వజారోహణం
  • కోటి తలంబ్రాలు తయారు చేసిన భక్తులు
  • 14న సీతారామ కల్యాణం, 15న పట్టాభిషేకం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల 6 నుంచి ప్రారంభమైన కల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు స్వామివారికి భేరిపూజ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని 60 గ్రామాలకు చెందిన 3 వేల మంది భక్తులు నాలుగు నెలల పాటు శ్రీరామ దీక్షతో ధాన్యాన్ని ఒలిచి కోటి తలంబ్రాలు తయారు చేశారు.

అలాగే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు అప్పారావు నేతృత్వంలో కోటి తలంబ్రాలను స్వామివారికి అప్పగించారు. రేపు సాయంత్రం సీతారాములకు ఎదురుకోలు ఉత్సవం జరగనుంది. ఈ నెల 20 వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 14న సీతారామ కల్యాణం, 15న పట్టాభిషేకం జరగనుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

Bhadrachalam
Appa Rao
Seetharamulu
Brahmostav
East Godavari District
  • Loading...

More Telugu News