Chandrababu: రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు

  • ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి
  • కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న బాబు
  • 12 గంటలకు సునీల్ అరోరాతో భేటీ 

సీఎం చంద్రబాబు నిన్న ఏపీలో జరిగిన ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఏపీలో జరిగిన ఎన్నికల తీరును వివరించనున్నారు.

రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లి, మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా, ఇతర కమిషనర్లను కలవనున్నారు. ఎపీ ఎన్నికల నిర్వహణ వైఫల్యాలతో పాటు వీవీ ప్యాట్‌ల లెక్కింపు సంఖ్యను సైతం పెంచాలని చంద్రబాబు కోరనున్నట్టు తెలుస్తోంది.

Chandrababu
Sunil Aroda
Andhra Pradesh
Elections
Delhi
  • Loading...

More Telugu News