KA Paul: నన్ను చూస్తే మోదీ భయపడతారు.. జయలలితలా జగన్ కూడా లోపలికి వెళతారు: కేఏ పాల్

  • చంద్రబాబుకు నా మద్దతు
  • 90 శాతం అక్రమాలు జరిగాయి
  • ఏకంగా చిప్‌నే మార్చేశారు
  • పార్టీలన్నీ కలిసి జాతిని కాపాడుకోవాలి

ఏపీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు అంటున్నట్టు 30 శాతం కాదని, 90 శాతం అక్రమాలు జరిగాయని, ఈ విషయంలో తాను కూడా ఆయనకు మద్దతు తెలియజేస్తున్నానని కేఏ పాల్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి ఎన్నికలను దేశ చరిత్రలోనే చూడలేదన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ కాదని, మొత్తం సిస్టమ్‌లోనే లోటు పాట్లు ఉన్నాయని.. ఏకంగా చిప్‌నే మార్చేశారని పాల్ ఆరోపించారు.

హెలికాఫ్టర్‌కి ఓటు వేస్తే, ఫ్యాన్‌కి పడుతోందని ఈ విషయాన్ని పలువురు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. జయలలిత లాగే జగన్ కూడా లోపలికి వెళతారన్నారు. తాను సీఎం అవుతానా? లేదంటే ఎంపీ అవుతానా? అన్నది ముఖ్యం కాదని, దేశం ముఖ్యం అని అన్నారు. అన్ని పార్టీలు కలిసి జాతిని కాపాడుకోవాలన్నారు. తెల్లవారు జామున రెండు, మూడింటి వరకూ పోలింగ్ జరగడమేంటని పాల్ ప్రశ్నించారు. తనను చూస్తే మోదీకి భయమని ఆయన అన్నారు.

KA Paul
EVM
Chandrababu
Narendra Modi
Helicaptor
Jayalalitha
Jagan
  • Loading...

More Telugu News