Inter: సాంకేతిక సమస్యల కారణంగానే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆలస్యం!

  • ఇంటర్ ఫలితాలను ప్రకటించిన ఏపీ
  • తెలంగాణలో రాని స్పష్టత
  • సోషల్ మీడియాలో ప్రచారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగాయి. నేడు ఆంధ్రప్రదేశ్ ఫలితాలను ప్రకటించగా, తెలంగాణ మాత్రం ఎప్పుడు ప్రకటిస్తామనే విషయంలో స్పష్టత కూడా ఇవ్వలేకపోతోంది. దీంతో తెలంగాణలోని విద్యార్థులు సహా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంటర్ పేపర్ వాల్యుయేషన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే తెలంగాణ ఫలితాలు ఆలస్యమవుతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Inter
Result
Telangana
Andhra Pradesh
Paper Valuation
Social Media
  • Loading...

More Telugu News