charan: వంశీ పైడిపల్లితో రెండోసారి రామ్ చరణ్

  • రాజమౌళి సినిమాతో బిజీగా చరణ్ 
  • తదుపరి సినిమా వంశీ పైడిపల్లితో
  • గతంలో 'ఎవడుతో హిట్ కొట్టిన కాంబినేషన్  

ప్రస్తుతం చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, 2020 జూలై 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాతనే చరణ్ తన తదుపరి సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడిగా వంశీ పైడిపల్లి పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

ఇటీవలే చరణ్ ను కలిసి వంశీ పైడిపల్లి ఒక లైన్ చెప్పాడట. లైన్ చాలా బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమని చరణ్ చెప్పినట్టుగా సమాచారం. తన తాజా చిత్రమైన 'మహర్షి' మే 9వ తేదీన విడుదలైన తరువాత, చరణ్ ప్రాజెక్టుపై కూర్చోవాలని వంశీ పైడిపల్లి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి సినిమాను చరణ్ పూర్తిచేసేలోగా .. ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన పనులను సిద్ధం చేయాలనే దిశగా వంశీ పైడిపల్లి రంగంలోకి దిగుతున్నాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎవడు' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

charan
vamsi paidipalli
  • Loading...

More Telugu News