tiger shroff: అదరగొట్టేస్తోన్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' ట్రైలర్

  • టైగర్ ష్రాఫ్ హీరోగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'
  • నాయికలుగా అనన్య పాండే .. తారా సుతారియా
  •  మే 10వ తేదీన భారీస్థాయి విడుదల    

టైగర్ ష్రాఫ్ హీరోగా పునీత్ మల్హోత్ర దర్శకత్వంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' రూపొందింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, టైగర్ ష్రాఫ్ సరసన అనన్య పాండే .. తారా సుతారియా నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కాలేజ్ క్యాంపస్ లో జరిగే గొడవలు .. ప్రేమలు .. సవాళ్లు .. ఆటలు .. పాటలు అన్నిటినీ ఈ ట్రైలర్లో చాలా కలర్ ఫుల్ గా చూపించారు. ట్రైలర్ ను చూస్తుంటే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలానే కనిపిస్తోంది. యూత్ కి కనెక్ట్ అయిందంటే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం .. భారీ విజయాన్ని అందించడం ఖాయమనేనని చెప్పాలి. మే 10వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మాదిరిగానే, 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' ఘనవిజయాన్ని సాధిస్తుందేమో చూడాలి

  • Loading...

More Telugu News