Chennai Super Kings: ధోనీ టీమ్ పై అసభ్య కామెంట్లు చేసి తిట్టించుకుంటున్న నటి కస్తూరి!

  • ఎంజీఆర్ లతను తడిమినట్టు తడుముకుంటున్నారన్న కస్తూరి
  • తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన లత
  • క్షమాపణలు చెప్పినా వదలని నడిగర సంఘం, సీఎస్కే ఫ్యాన్స్

చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ పోటీని ప్రస్తావిస్తూ, నటి కస్తూరి చేసిన అసభ్య కామెంట్లు ఆమెపై విమర్శల వర్షం కురిసేలా చేశాయి. తన కామెంట్లలో దివంగత ఎంజీఆర్, సీనియర్ నటి లతలను సైతం ఆమె కించపరిచింది. "ఏమిటో ఈ మ్యాచ్‌ ‘పల్లాండు వాళగ’ చిత్రంలో ఎంజీఆర్‌, లతను తడిమినట్లు తడుముకుంటున్నారు" అని కస్తూరి వ్యాఖ్యానించింది.

దీనిపై అభిమానుల తిట్ల వర్షాన్ని పక్కన పెడితే, లత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఎన్నడూ కస్తూరి నటించినంత విచ్చలవిడిగా నటించలేదని, అనవసరంగా తననెందుకు రచ్చకెక్కించిందో తెలియడం లేదని, ఆమెను ఊరికే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించింది. దీంతో ఓ మెట్టు దిగిన కస్తూరి, స్వయంగా లతకు ఫోన్ చేసి క్షమాపణలు కోరింది. నడిగర సంఘం ఆమెకు నోటీసులు జారీ చేసింది. సీఎస్కే ఫ్యాన్స్ ఇంకా కస్తూరిని వదల్లేదు. ఆమె గత చిత్రాల్లో నటించిన రొమాంటిక్ సీన్ల వీడియోలు పోస్ట్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు.

Chennai Super Kings
Kasturi
MS Dhoni
Latha
MGR
  • Loading...

More Telugu News