Election Commission: అలీ, భజరంగ్‌బలీ వార్తలపై యూపీ సీఎంకు ఈసీ నోటీసులు

  • ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేయొద్దని మమత పిలుపు
  • ఈ ఎన్నికల్లో పోటీ అలీకి-భజరంగ్‌బలికి మధ్యేనన్న యోగి
  • ఇద్దరికీ షోకాజ్ నోటీసులు.. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్‌ను ఉల్లంఘించి పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలకు ఎన్నికల సంఘం గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల దేవ్‌బంద్‌లో మాయావతి మాట్లాడుతూ.. ముస్లింలు ఎవరూ కాంగ్రెస్‌కు ఓటేయవద్దని, అలా వేస్తే ఓట్లు చీలిపోయి బీజేపీ గెలుస్తుందని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.

మాయావతి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ మీరట్ ప్రచార సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎస్పీ-బీఎస్పీల వద్ద అలీ ఉంటే.. తమకు భజరంగ్‌బలి (హనుమంతుడు) ఉన్నాడని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో యుద్ధం అలీ-భజరంగ్‌బలి మధ్యేనని పేర్కొన్నారు. మాయావతి, యోగి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Election Commission
Yogi Adityanath
Mayawati
Ali
Bajrang Bal
  • Loading...

More Telugu News