Telangana: తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది: డీజీపీ మహేందర్ రెడ్డి

  • చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు
  • సురక్షిత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి
  • భద్రతా సిబ్బందికి అభినందనలు

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘట కూడా జరగలేదని, సురక్షిత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అభినందనలు, కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని, పోలీసులు, ఎన్నికల సిబ్బందికి ప్రజలు బాగా సహకరించారని అన్నారు.

Telangana
Elections
DGP
Mahender Reddy
  • Loading...

More Telugu News