KTR: పాపకు గుండెలో రంధ్రం ఉంది, సాయం చేయండన్న ఓ తండ్రికి కేటీఆర్ భరోసా

  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ ప్రెసిడెంట్
  • మేం ఉన్నాం బ్రదర్ అంటూ రిప్లయ్ 
  • వెంటనే ఆఫీసుకు రావాలంటూ సూచన

సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకుంటూ వేగవంతమైన ప్రజాసేవ చేసే నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ఒక చిన్న ట్వీట్ చేస్తే చాలు ఆయన స్పందిస్తారనడానికి గతంలో ఎన్నో సంఘటనలు నిదర్శనంగా నిలిచాయి. సామాజిక సమస్యలే కాదు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే నిరుపేదలకు సైతం కేటీఆర్ ఆపన్నహస్తం అందిస్తారు. తాజాగా, నరేష్ అనే వ్యక్తి తన కుమార్తెకు గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారని, చికిత్సకు అవసరమైన రూ.5.5 లక్షలు తమ స్థాయికి మించిన మొత్తం అని కేటీర్ కు ట్వీట్ చేశారు.

అత్యవసరంగా శస్త్రచికిత్స చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారని, ప్రస్తుతం తన పాప ఐసీయూలో ఉందని నరేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. దయచేసి సాయం చేయండి సార్ అంటూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఓవైపు పోలింగ్ హడావుడిలో ఉన్నా గానీ కేటీఆర్ ఈ ట్వీట్ కు వెంటనే స్పందించారు. తప్పకుండా ఆదుకుంటాం బ్రదర్, దయచేసి ఆఫీసుకు రండి అంటూ పెద్దమనసుతో భరోసా ఇచ్చారు.

Will take care brother @KTRoffice please contact https://t.co/A0FID1gauy

— KTR (@KTRTRS) April 11, 2019అ ">

KTR
  • Loading...

More Telugu News