Andhra Pradesh: ఏపీలో ముగిసిన ఎన్నికల పోలింగ్

  • 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో ముగిసిన పోలింగ్
  • అరకు, పాడేరు, రంపచోడవరంలో నాల్గింటికే ముగింపు
  • సాలూరు, పార్వతీపురం, కురుపాంలో ఐదింటికి పూర్తి 

ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు నిర్వహించిన పోలింగ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే లోపు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు, సాలూరు, పార్వతీపురం, కురుపాంలో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

Andhra Pradesh
Elections
Assembly
loksabha
  • Loading...

More Telugu News