Telangana: తెలంగాణలో ముగిసిన పోలింగ్

  • ఐదు గంటలతో ముగిసిన పోలింగ్
  • సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పూర్తి 
  • రాష్ట్ర వ్యాప్తంగా 48.95 శాతం పోలింగ్  

తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ లో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 48.95 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ నగరంలో కనీసం 30 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదని సమాచారం. ఇదిలా ఉండగా, ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సీఈఓ రజత్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Telangana
Elections
Loksabha
Nizamabad District
  • Loading...

More Telugu News