Khushboo: ​ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప పగలగొట్టిన ఖుష్బూ

  • బెంగళూరులో ఘటన
  • ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నటి
  • వ్యక్తి ప్రవర్తన పట్ల మండిపాటు

దక్షిణాది నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓ వ్యక్తి చెంప పగలగొట్టారు. ఆ వ్యక్తి వెనుక నుంచి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో ఆగ్రహించిన ఖుష్బూ వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించారు. ఖుష్బూ బెంగళూరులో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నాయకుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం అభ్యర్థి రిజ్వాన్ అర్షాద్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు.

భారీ జనసందోహం మధ్యలో ఖుష్బూ నడుస్తుండగా, వెనుక నుంచి ఓ వ్యక్తి ఆమెను అభ్యంతరకర రీతిలో తాకాడు. దాంతో, ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తిని ఎడాపెడా వాయించేశారు. ఇంతలో పోలీసులు, కార్యకర్తలు వెంటనే స్పందించి ఆ యువకుడ్ని ర్యాలీ నుంచి బయటికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

This is called Kapala Moksha in Kannada. @khushsundar slapped a man who tried to misbehave with her while campaigning for Bengaluru Central Candidate. Even few lady  reporters who are subjected to this kind of harassment should learn from Kushboo. #LokSabhaElections2019 pic.twitter.com/v5ZuFDTTZaq

— Sagay Raj P (@sagayrajp) April 10, 2019q ">

  • Loading...

More Telugu News