Andhra Pradesh: ఏపీలో ఈరోజు మధ్యాహ్నానికి 54 శాతం పోలింగ్ నమోదు

  • సాయంత్రం ఆరు గంటలతో ముగియనున్న పోలింగ్
  • ఆలోపు క్యూలైన్ లో ఉన్న ప్రతిఒక్కరూ ఓటేయొచ్చు  
  • ఓటు వేశాకే తిరిగి వెళ్తామంటున్న వృద్ధులు, మహిళలు

ఏపీ వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు 54 శాతం పోలింగ్ నమోదైంది. ఎండ తీవ్రత బాగా ఉండటంతో ఓటర్లు తక్కువగా వచ్చినట్టు సమాచారం. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు నిరుత్సాహం చెందారు. సాయంత్రం ఆరు గంటలతో పోలింగ్ సమయం ముగియనుండటంతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆరు గంటల వరకు క్యూలైన్ లో ఉన్న ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎండ తీవ్రత కాస్త తగ్గడంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నట్టు సమాచారం. ఎంత రద్దీ ఉన్నా ఓటు వేశాకే తిరిగి వెళ్తామని వృద్ధులు, మహిళా ఓటర్లు చెబుతున్నారు.

Andhra Pradesh
Elections
poling
54 per cent
  • Loading...

More Telugu News