Andhra Pradesh: ఏపీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

  • అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్
  • నాలుగు లోగా క్యూలో ఉన్న వారు ఓటేయొచ్చు
  • మిగిలిన నియోజకవర్గాల్లో  సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్

ఏపీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ ఈరోజు నాలుగు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల కంటే రెండు గంటలు ముందుగానే పోలింగ్ ముగించారు. నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కాగా, ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియనుంది.

Andhra Pradesh
arak
paleru
rampachodavaram
  • Loading...

More Telugu News