Guntur District: ఓ రెస్టారెంట్ పై వైసీపీ కార్యకర్తల దాడి

  • గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఘటన
  • రెస్టారెంట్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం
  • అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారుల దాడి

ఏపీలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులతో పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలు, రాళ్ల దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. తాజాగా, గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని ఓ రెస్టారెంట్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రెస్టారెంట్ అద్దాలు, ఫర్నీచర్ తో పాటు అక్కడ పార్కింగ్ చేసి ఉన్న కార్లను ధ్వంసం చేసినట్టు సమాచారం. అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారుల దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.  

Guntur District
Narasaraopet
Restaurant
YSRCP
  • Loading...

More Telugu News