lakshmi parvathi: ఓటు వేసిన తర్వాత లక్ష్మీపార్వతి స్పందన

  • ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పని చేయాలి
  • టీఎన్ శేషన్ సమర్థవంతంగా పని చేశారు
  • పోలింగ్ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నా

దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని... నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు టీఎన్ శేషన్ ఎంతో సమర్థవంతంగా పని చేశారని... ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఏపీలో పోలింగ్ నేపథ్యంలో ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయని, డబ్బు ఏరులై పారిందని... వీటిని నియంత్రించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు. మంగళగిరిలో భారీగా డబ్బు పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

lakshmi parvathi
ysrcp
  • Loading...

More Telugu News