ap: మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీ, తెలంగాణల్లో ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే..!

  • ఏపీలో 46 శాతం పోలింగ్ నమోదు
  • తెలంగాణలో 38.8 శాతం పోలింగ్
  • సాయంత్రానికల్లా పెరగనున్న ఓటింగ్ శాతం

ఈవీఎం సమస్యలతో తొలి గంటల్లో ఏపీలో తక్కువ పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. అయితే, క్రమంగా పోలింగ్ శాతం పుంజుకుంది. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఏపీలో 46 పోలింగ్ శాతం నమోదైంది. ఏపీతో పోల్చితే తెలంగాణలో తక్కువ ఓటింగ్ నమోదైంది. ఒంటి గంట సమయానికి 38.8 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. సాయంత్రానికల్లా ఈ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

ap
telangana
polling percentage
  • Loading...

More Telugu News