Sobhana Kamineni: ఓటేసేందుకు ఫారిన్ నుంచి వచ్చిన శోభనా కామినేని... గల్లంతు కావడంతో తీవ్ర ఆగ్రహం!

  • ఓటేసేందుకు వచ్చిన శోభనా కామినేని
  • ఇదో విచారకరమైన రోజంటూ ఆగ్రహం
  • అన్యాయాన్ని సహించబోనని హెచ్చరిక

తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల నుంచి వస్తే, ఓటు గల్లంతైందంటూ అపోలో హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్ ప్రతాప్‌పెడ్డి కుమార్తె, సినీ నటుడు రామ్ చరణ్ అత్తగారు శోభనా కామినేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఓటేసేందుకు ఓటరు కార్డును తీసుకెళ్లిన ఆమెకు, ఓటు లేదని, దాన్ని తొలగించారని, ఎందుకు తొలగించారన్న కారణం తమకు తెలియదని ప్రిసైడింగ్ అధికారులు తెలిపారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, దేశ పౌరురాలినైన తనకు ఇదో విచారకరమైన రోజని అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని సహించబోనని హెచ్చరించారు. కాగా, చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా శోభన సమీప బంధువేనన్న సంగతి తెలిసిందే.

Sobhana Kamineni
Vote
Angry
  • Loading...

More Telugu News