chandrababu: ఈ శుభపరిణామంలో ఇలా జరగడం దురదృష్టకరం: చంద్రబాబు

  • యువత, మహిళలు భారీ ఎత్తున ఓటు వేయడానికి రావడం సంతోషకరం
  • ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోవడం దురదృష్టకరం
  • మళ్లీ తిరిగి వచ్చి ఓటు వేయండి

ఓటు వేయడం అందరి సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యువత, మహిళలు భారీ ఎత్తున పోలింగ్ బూత్ లకు తరలివస్తున్నారని... ఇది శుభపరిణామమని చెప్పారు. ఇలాంటి సంతోషకర సమయంలో... ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. ఓటు వేయకుండా వెళ్లిపోయినవారు... మళ్లీ తిరిగి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీరు వేసిన ఓటు సరిగా పడిందో, లేదో వీవీ ప్యాట్ లోని స్లిప్పును చూసి నిర్ధారించుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ సేపు వేచి ఉన్నామని, విసుగు చెందవద్దని సూచించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, ఓటును మాత్రం తప్పనిసరిగా వేయాలని చెప్పారు.

chandrababu
Telugudesam
polling
  • Loading...

More Telugu News