Crime News: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. విజయనగరం జిల్లా గరివిడిలో విషాదం

  • రైలుకిందపడి తల్లీ, ఇధ్దరు కూతుర్లు దుర్మరణం
  • కుటుంబ కలహాలే కారణమన్న అభిప్రాయం
  • మృతులు కె.ఎల్‌.పురం వాసులు

ఇద్దరు కూతుర్లతో పాటు తాను రైలుకింద పడి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లా గరివిడిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి చెందిన సాకేటి అంజలి (28) ఇద్దరు కుమార్తెలు మణి (7), జ్యోత్స్న (6)లతో కలిసి గరివిడి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి వచ్చింది. రైలు వస్తున్న సమయంలో వారు పట్టాలపైకి రావడంతో ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Crime News
Vijayanagaram District
garividi
mother and children suicide
  • Loading...

More Telugu News