Chandrababu: ఓడిపోతానన్న విషయం చంద్రబాబుకు తెలిసిపోయింది: వాసిరెడ్డి పద్మ

  • ఫలితాల తరువాత తప్పును ఈవీఎంలపై రుద్దేందుకు ప్లాన్
  • చంద్రబాబు వ్యాఖ్యల వెనకున్న మర్మమిదే
  • ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం పద్మ

ఈ ఎన్నికల్లో తాను ఓడిపోనున్నానన్న విషయం చంద్రబాబునాయుడికి తెలిసిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ ఉదయం ఎన్నికల కమిషనర్ ద్వివేదిని కలిసిన ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మర్మం ఇదేనని అన్నారు.

ఫలితాల తరువాత తప్పు ఈవీఎంలదేనని చెప్పే ప్రయత్నంలో భాగంగానే, ఆయన మాట్లాడారని ఎద్దేవా చేశారు. దాదాపు 96 వేలకు పైగా ఈవీఎంలను రాష్ట్రంలో వాడుతుంటే, దాదాపు 344 ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని, వాటిని ఇప్పటికే సరిచేశారని అన్నారు.  ప్రజలంతా నిర్భయంగా వెళ్లి ఓట్లు వేసి రావాలని ఆమె కోరారు. ఈవీఎంల సమస్యలు చాలా స్వల్పమైనవని, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

Chandrababu
Vasireddy Padma
YSRCP
Elections
  • Loading...

More Telugu News