Andhra Pradesh: పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • విజయవాడలోని 25వ డివిజన్ లో ఘటన
  • ఈవీఎంల పనితీరుపై టీడీపీ నేతల అసంతృప్తి
  • అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ సందర్భంగా ఈవీఎంల పనితీరుపై టీడీపీ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర నిరసన తెలిపారు. విజయవాడలోని 25వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

ఈవీఎంలు లోపాలతో ఉన్నాయనీ, ప్రస్తుతం పోలింగ్ ఆపేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇలా ఆందోళనలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్దమని పోలీస్ అధికారులు నచ్చజెప్పారు. అయినా బుద్ధా వెంకన్న వినిపించుకోకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Andhra Pradesh
Vijayawada
rvm
Telugudesam
budha venkanna
Police
arrest
  • Loading...

More Telugu News