Andhra Pradesh: నెల్లూరులో మేకపాటి వర్సెస్ కొమ్మి వర్గీయుల ఘర్షణ.. ఇద్దరు వైసీపీ నేతలకు పగిలిన తలలు!

  • చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లెలో ఘటన
  • పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు మేకపాటి గౌతమ్ రెడ్డి యత్నం
  • అడ్డుకున్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు గ్రూపు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లెలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డిని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి.

రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ నేతల తలలు పగలడంతో వారిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘర్షణ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం వైసీపీ, టీడీపీ నేతలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలని కోరారు.

Andhra Pradesh
Nellore District
YSRCP
Telugudesam
fight
mekapati
kommi
  • Loading...

More Telugu News