Andhra Pradesh: కర్నూలులో వైసీపీ-టీడీపీ స్ట్రీట్ వార్.. రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు!

  • అహోబిలంలో పోలింగ్ సందర్భంగా ఘటన
  • రెండు గ్రూపులను చెదరగొట్టిన పోలీసులు
  • ఘటనాస్థలికి అనుచరులతో కలిసి వచ్చిన అఖిలప్రియ

రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఈరోజు పోలింగ్ సందర్భంగా వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసుకున్నాయి. ఈరోజు అహోబిలంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లే క్రమంలో భూమా-గంగుల వర్గీయులు ఘర్షణ పడ్డారు.

ఇదికాస్తా ముదరడంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి అఖిలప్రియ అనుచరులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో ఆమెకు సర్దిచెప్పిన పోలీస్ ఉన్నతాధికారులు వెనక్కి వెళ్లాల్సిందిగా కోరారు.  అయితే ముందుగా నిందితులపై చర్యలు తీసుకుంటేనే వెళతానని ఆమె స్పష్టం చేశారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి అఖిలప్రియ వెళ్లిపోయారు.

Andhra Pradesh
Kurnool District
YSRCP
Telugudesam
fight
  • Loading...

More Telugu News