Vijayawada: మొగల్రాజపురం పోలింగ్ బూత్ కు తాళం వేసిన ఓటర్లు!

  • అనూహ్య నిర్ణయం తీసుకున్న ఓటర్లు
  • ఈవీఎంలు మొరాయించడంతో అసహనం
  • తాళం వేయడంతో తలలు పట్టుకున్న అధికారులు

విజయవాడ పరిధిలోని మొగల్రాజపురం ఓటర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా పోలింగ్ బూత్ కే తాళం వేసేశారు. ఇక్కడి ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాలేదు. 4వ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ప్రిసైడింగ్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినా, సకాలంలో ఈవీఎంలు పోలింగ్ బూత్ కు చేరలేదు.

దీంతో ఈసీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఓటర్లు, పోలింగ్ బూత్ కు తాళం వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో అధికారులు తలలు పట్టుకున్నారు. ఇక్కడి పోలింగ్ కేంద్రానికి కొత్త ఈవీఎం మెషీన్లను పంపే ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ ను ప్రారంభిస్తామని, అవసరమైతే సాయంత్రం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పెంచుతామని అధికారులు వెల్లడించారు.

Vijayawada
Polling Booth
Voting
Lock
  • Loading...

More Telugu News