Mangalagiri: వైసీపీకి ఓట్లు పడేచోట పనిచేయని ఈవీఎంలు... ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నా!

  • లోకేశ్ కు అనుకూలంగా పనిచేస్తున్నారు
  • ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం
  • మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టీ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరిలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే చోట్ల మాత్రమే ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని, వీవీ ప్యాట్లలో తాము ఎవరికి ఓటు వేశామో ఓటర్లు చూడలేకపోతున్నారని ఆరోపించిన వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు.  ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆళ్ల ఆరోపించారు. ఈవీఎంలు పనిచేయకున్నా పట్టించుకోవడం లేదన్న అసహనాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ కు మేలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Mangalagiri
Alla Ramakrishnareddy
Nara Lokesh
Polling
EVMs
  • Loading...

More Telugu News